fbpx

AP News Online

ఈ ప్లాన్ పారితే మరోసారి కేసీఆర్ దే అధికారం!

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి.. కేసీఆర్ అదే చేస్తున్నారు.. సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతున్నారు.. కేసీఆర్ వేసిన ప్లాన్ వర్క్ అవుట్ అయితే ఇక తెలంగాణలో ఆయనకు మరోసారి అధికారం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.. ఇందుకోసం పకడ్బందీ వ్యూహంతో ఆయన ముందుకు వెళుతున్నారు..

ఇన్నాళ్లు కేసీఆర్ ప్రజాకర్షక పథకాలకు రూపకల్పన చేసి విజయం సాధించారు. కేసీఆర్ పథకాలు దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు దక్కాయి.. మిషన్ కాకతీయ, భగీరథలు అయితే వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. హరితహారం పథకానికి అయితే కేంద్రం నుంచి ప్రశంసలు దక్కాయి.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు వంటి పథకాలు తెలంగాణలో ప్రజాదరణ పొందాయి.. అవి అత్యంత పేదలకే దక్కాయి. కేసీఆర్ ను ముందంజలో నిలిపాయి..

ఇప్పుడు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ బలమైన సామాజిక వర్గాన్ని ఆకర్షించేలా పథకాన్ని రూపకల్పన చేశారు. బీసీలను టార్గెట్ చేసి వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించేందుకు గడిచిన వారం రోజులుగా సమావేశాలను జరుపుతున్నారు. గొల్లకుర్మలు, చేనేత, కమ్మరి, కుమ్మరి, రజక ఇలా సబ్బండ బీసీ వర్గాల సంఘాలతో సమావేశమై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ పథకాన్ని రూపకల్పన చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే గొల్ల వారి కోసం పెద్ద ఎత్తున గొర్రెల పెంపకాన్ని పెంచేందుకు కేసీఆర్ ప్రోత్సహాకాలు, రాయితీ లు ప్రకటించారు. అదే విధంగా ఇకముందు అన్ని కులాల వారి సమస్యలు తీర్చేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే బీసీలందరికీ ఉపాధి, ఉద్యోగావకాశాలు కలిగి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు బోలెడు లబ్ధి చేకూరనుంది.. అధికారం కూడా ప్రాప్తించే అవకాశం కలగనుంది..

To Top

Send this to a friend