fbpx

AP News Online

ఎక్సెల్ ఫిల్మ్స్ ‘సూపర్ రైమ్స్ ‘

superrhymes-apnews
చిన్నపిల్లల మనోవికాసానికి ,మన స్థత్వానికి  అర్ధమయ్యేలా , వారిలో మానసికి స్థైర్యం పెంపోందించే ఉద్దేశ్యంతో రూపోందిస్తున్న చిత్రం ‘సూపర్ రైమ్స్ ‘ . ఎక్సెల్ ఫిల్మ్స్  సమర్పణలో వాజిద్ ఖాన్ నిర్మాతగా  రామ్ రెడ్డి పన్నాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం పోస్టర్ మరియు ఆడియో లాంచ్ కార్యక్రమం హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా, చీఫ్ గెస్ట్ అడిషన్ ఏస్పీ సత్యనారాయణ మట్లాడుతూ :నేను  ‘సూపర్ రైమ్స్ ‘కార్యక్రమానికి వచ్చి ఈ చిత్రం పోస్టర్ ,ఆడియో ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానని అన్నారు..నేటి బాలలే రేపటి పౌరులు ..వారి మనోవికాసానికి ఉపయోగపడే ఈ సూపర్ రైమ్స్ చిత్రం తప్పకుండా సక్సెస్ అవుతుందని అన్నారు..సూపర్ రైమ్స్ లోని పాటలు  విన్నాక..ఇది ఖచ్చితంగా పిల్లలను  అలరిస్తుందనే నమ్మకం ఏర్పడిందన్నారు..ఈ చిత్రాన్ని రూపోందిస్తున్న నిర్మాత వాజిద్ ఖాన్ , దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల ,అలాగే ఈ చిత్రంలోని నటీనటులకు శుబాకాంక్షలు తెలిపారు..
నిర్మాత వాజిద్ ఖాన్ మాట్లాడుతూ  : ఈ సూపర్ రైమ్స్ చిత్రం అందర్ని చక్కగా ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉంది..ఇప్పుడు ఇక్కడున్న పిల్లల కేరింతలు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉందన్నారు.. సూపర్ రైమ్స్ చిత్రానికి  సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలిపారు..ఇది చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా సరికొత్త థీమ్ తో డిజైన్ చేశామని అన్నారు..ఈ చిత్రం పిల్లలకు ఒక సర్ ఫ్రైజ్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందన్నారు..ఈ ప్రాజెక్ట్ ను 15 రోజుల్లో పూర్తి చేసి దీనికి సంబంధించిన ట్రైలర్ ను , సినిమాను డివిడి రూపంలో మార్కెట్లోకి రిలీజ్ చేస్తామని తెలిపారు..
దర్శకుడు రామిరెడ్డి పన్నాల మాట్లాడుతూ : మనం భాదలో ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని చేస్తే ఆ భాద క్షణంలో మాయమౌవుతుంది..అందుకే చిన్నపల్లల పై సూపర్ రైమ్స్ ఇండిపెండెంట్  ఫిల్మ్ ను ప్లాన్ చేసుకున్నామన్నారు..ఈ ప్రాజెక్ట్ అనుకున్న వెంటనే నిర్మాత వాజిద్ ఖాన్ గారికి చెప్పగానే బాగుందని ఎంకరేజ్ చేశారన్నారు..ఈ ప్రాజెక్ట్ ను వాజిద్ ఖాన్ గారు చాలా కేర్ తీసుకుని నిర్మించారన్నారు..ఈ సూపర్ రైమ్స్ అందర్ని అలరించి మా టీమ్ కు మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉందన్నారు…
ఈ కార్యక్రమంలో నిర్మాత పధ్మానాభ రెడ్డి ,సూపర్ రైమ్స్ టీమ్ పాల్గోన్నారు..ఈ కార్యక్రమంలోని సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలను ఆకట్టుకున్నాయి..చిన్నపిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టడం ఈ కార్యక్రమంలో హైలెట్ గా నిలిచింది..
కాన్సెప్ట్ డిజైన్ : ఎక్సెల్ ఫిల్మ్స్ , కెమెరా :సి.హెచ్ .మోహన్ ,కొరియోగ్రఫీ :కిరణ్ , ఎడిటింగ్ :సంతోష్ కె.నాయుడు ,డైరెక్షన్ డిపార్ట్ మెంట్ : వి.ఉమేష్ ,అబ్దుల్ రజాక్ (జాక్ ),లక్షణ్ కొత్తపల్లి
స్టైలింగ్ : కృష్ణ , నిర్మాత : వాజిద్ ఖాన్ , దర్శకత్వం :రామ్ రెడ్డి పన్నాల
To Top

Send this to a friend