fbpx

AP News Online

ఖైదీ x శాతకర్ని .. దేనికి ప్రేక్షకుల ఓటు?

సంక్రాంతి బరిలో పందేంకోళ్ల వలే తలపడ్డ ఇద్దరు అగ్రహీరోల సినిమాలు మొత్తానికి విడుదలయ్యాయి.. అటు చిరు 150వ చిత్రం ఖైదీ నంబర్ 150, ఇటు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలై అభిమానుల ఆకలి తీర్చాయి.. తెలుగు సినీ పరిశ్రమలో ఇలా ఇద్దరు అగ్రహీరోలు సహృద్భావ వాతావరణంలో విడుదల చేయడం.. ఒకరినొకరు ఈ రెండు సినిమాలు విజయం సాధించాలని ఆకాంక్షించడం మంచి సంప్రదాదయం..కానీ ఈ రెండు సినిమాల్లో అభిమానులను అలరించినవి ఏవీ.. థియేటర్లో సినిమా చూసిన సగటు ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడు.. బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్న ఈ రెండు చిత్రాల్లో అభిమానులు ఏ సినిమాకు పోటెత్తుతున్నారనే విషయాలను మనం చూద్దాం..

చారిత్రక సినిమా బాలయ్య వందో చిత్రంగా ఎంచుకున్నారు.. సామాజిక అంశాన్ని చిరు ఇతివృత్తంగా తీశారు.. మరి ఈ రెండు చిత్రాలు చూసిన అభిమానులు దేనికదే విశ్లేషిస్తున్నారు. చిరు అభిమానులు ఖైదీకి, బాలయ్య అభిమానులు శాతకర్ణి కి ఓటేయడం సహజం.. మరి సగటు ప్రేక్షకుడి తీర్పు ఎలా ఉందో క్షేత్రస్థాయికి వెళితే అర్థమవుతోంది..

సామాజిక అంశాలు, రైతుల గాథను కథగా తీసుకొని దానికి మంచి కమర్సియల్ అంశాలు జోడించి చిరు స్టామినాను, డ్యాన్స్ ను, కథను నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. చిరంజీవి ఖైదీ సినిమా చూసినప్పుడు అభిమానులు మునివేళ్లపై నిలబడి కథలో లీనమైపోతున్నారు.. చిరు నుంచే ఆశించే అన్ని అంశాలు అందులో ఉన్నాయి.. కథ, కథనం, ట్విస్ట్ లు, సమాజ హితం, మెసేజ్, డ్యాన్సులు, హీరోయిజం.. ఇలా అన్ని కలగలిపి విందుభోజనంలా చిరు సినిమా అందరినీ అలరిస్తోంది.. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన చిరు ఎంచుకున్న కథ.. అఖిల్ తో ఢీలాపడ్డా వినాయక్ ఎగిసిన కెరటంలా కసితో సినిమా తీసి ప్రేక్షకుల చేత శభా ష్ అనిపించుకున్నారు.అందుకే ఇప్పుడు సంక్రాంతి బరిలో బాక్సాఫీసు వద్ద చిరు ఖైదీ దుమ్మురేపుతోంది.. అద్భుత విజయంతో ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది..

ఇక బాలయ్య వందో చిత్రం మంచి కథను ఎంచుకున్నారు. యావత్ భారత దేశాన్ని జయించిన రాజు కథను ఎంచుకొని పోరాట సన్నివేశాలను అద్భుతంగా తీశారు. కానీ రాజు చరిత్ర, పాలన, కథ ఉద్దేశం నడిపించే తీరు పై అభిమానుల్లో అసంతృప్తి ఉంది. పోరాట సన్నివేశాలు, యుద్ధాలు ఎక్కువై కథ అస్సలు అభిమానులకు తెలియకపోవడం శాతకర్ణి అభిమానులను నిరాశపరిచింది. కానీ సినిమాలో బాలయ్య పంచ్ డైలాగులు, వారు సీన్లు మాత్రం ఆకట్టుకున్నాయి. బాహుబలిని ఊహించుకొని వెళితే మాత్రం డిస్పాప్పాయింట్ తప్పదు. ఎందుకుంటే అందులో కథ తెలుస్తుంది. వారు ఎందుకు అలా యుద్దానికి వెళుతున్నారో తెలుస్తుంది. కానీ ఇందులో దేశాన్ని ఐక్యం చేయడానికి వెళుతున్న బాలయ్య పోరాటాలే మనకు తెలుస్తుంది. ఆరాజ్యం, రాజులు, శాతకర్ని చరిత్ర.. ఆయన తల్లి గౌతమి విశిష్టత, భార్య, దేశం.. సంబంధాలు, ప్రజల జీవన విధానం లాంటి కీలక అంశాలను విస్మరించి క్రిష్ పొరపాటు చేశారనే చెప్పాలి.. మొత్తం గా బాలయ్య సినిమా ఆయన అభిమానులకు మాత్రం హిట్టే..కానీ సగటు ప్రేక్షకుడిగా మాత్రం కొంచెం అసంతృప్తి..

To Top

Send this to a friend