fbpx

AP News Online

చిరంజీవా.. మా తప్పులను మన్నించి.. ప్రస్తావించకు..

k150pre

చిరంజీవి 150 వ సినిమా వేడుక హ్యాయ్ లాండ్ లో ఘనంగా జరిగింది. అభిమాన సంద్రం పోటెత్తింది.. ఎవ్వరూ ఊహించని సక్సెస్ సాధించింది. ఆడియో వేడుకకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు, కొందరు తెరవెనుక చేసిన మంత్రాంగం విఫలమైందని చిరు అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.. అల్లు అరవింద్ తో పాటు మరికొందరు చిరు ఆడియో వేడుక మార్పుపై చిరంజీవే వేదికపై సమాధానమిస్తారని చెప్పడం మీడియాలో కలకలం రేగింది. దీన్ని హైలెట్ చేయడంతో ప్రభుత్వంలో, పోలీసుల్లో వణుకు మొదలైంది.. అందుకే చిరు ఆడియో వేడుకలో పెద్ద ఎత్తున పోలీసులు కన్పించారు. వేడుకను అరగంటలో ముగించాలని చిరును ప్రాధేయపడ్డారు.

చిరంజీవి తన ఆడియో వేడుకకు అడ్డంకులు సృష్టించిన వారిని వేదికపై కడిగేస్తారనే సమాచారం అందుకున్నారో ఏమో కానీ ఏపీ క్యాబినెట్ లోని ఇద్దరు మంత్రులు కామినేని శ్రీనివాస్ రావు, పత్తిపాటి ఇంటిమేషన్ లేకున్నా ఆదరబదరాగా వచ్చి చిరు శరుణుజొచ్చారని సమాచారం. లక్షల్లో వచ్చిన జనం ముందు ఆడియో వేడుకకు పర్మిషన్ ఇవ్వలేదని చిరు అంటే శాంతిభద్రతల సమస్య, తమ ప్రభుత్వంపై విమర్శలు వస్తాయని.. విధ్వంసాలు జరుగుతాయని.. అందుకే చిరు ప్రసంగంలో ఆ విషయం ప్రస్తావించవద్దని మంత్రులు కోరినట్టు భోగట్టా.. అందుకే చిరంజీవి తనలో ఉన్న బాధను ప్రసంగంలో వ్యక్తీకరించలేదు. అంతేకాదు.. తాను చెబుదామనుకున్న చాలా విషయాలను ప్రస్తావించలేదు. అరగంటలోనే సినిమా పై మాత్రమే మాట్లాడి ముగించేశారు. ఇద్దరు ఏపీ మంత్రులు రావడంతోనే చిరంజీవి సంధి కుదిరి పర్మిషన్ విషయం ప్రస్తావించలేదనే పుకార్లు షికార్లు చేశాయి.. ఏదైనా చిరు తన పరణితితో శత్రువులను కూడా కనికరించారు. అభిమానుల అండతో అన్నయ్యగా పెద్దన్న పాత్ర పోషించారు. అవే ఆయన చిత్రానికి ప్లస్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు..

To Top

Send this to a friend