fbpx

AP News Online

టీవీ9 సీఈవో రవిప్రకాశ్ ఇంటర్వ్యూ విత్ చిరంజీవి

chiranjeevi-tv9

పోటీ ప్రపంచం.. ఒకరిని మించి ఒకరు ముందుకెళ్తేనే భవిష్యత్.. అంతటి క్లిష్టమైన కాంపిటీషన్ లో ప్రతి ఒక్కరు తమ విజయంపైనే దృష్టిసారిస్తారు.. కానీ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలికారు..చిరు 150 వ సినిమా ప్రి రిలీజ్ ఆడియో వేడుక సాక్షిగా చిరంజీవి తన కాంపిటీషన్ ను పక్కనపెట్టి అందరికీ మంచి మేసేజ్ ఇచ్చారు. తన సినిమా ఖైదీ నంబర్ 150తో పాటు తన సోదరుడు బాలక్రిష్ణ నటిస్తున్న శాతకర్ణి మూవీ హిట్ కావాలని.. అలాగే దిల్ రాజు నిర్మించిన శతమానంభవతి సినిమా.. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి నటించిన పోలీస్ వెంకట్రామయ్య సినిమాలు కూడా హిట్ సాధించాలని ఆక్షాంక్షిస్తున్నట్టు చిరు చెప్పారు..

ఈరోజు సాయంత్రం టీవీ9 సీఈవో రవిప్రకాశ్ ఇంటర్వ్యూలో పలు సంచలనాలు విషయాలు బయటపెట్టారు. బాలయ్యతో తనకు వైరం లేదని.. మేమంతా స్నేహంగా ఉంటామన్నారు. రాంచరణ్.. మహేశ్ బాబు లు కూడా స్నేహంగా ఉంటారని.. ఇటీవలే స్విట్జర్లాండ్ లో వాళ్లిద్దరు కలుసుకున్నారన్నారు. బాలయ్య 100 సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. దంగల్, పీకే లాంటి నటనకు ఆస్కారం ఉన్న డిఫెరెంట్ స్టోరీలు తెలుగులో మీరు ఎందుకు చేయడం లేదని రవిప్రకాశ్ అడినప్పుడు.. ఆ చిత్రాల్లో చిరంజీవిని అభిమానులు అక్సెప్ట్ చేయలేరని.. రుద్రవీణ మంచి చిత్రమైనా అది కమర్షియల్ హిట్ కాని విషయం మీరు గుర్తెరగాలన్నారు..

ఇక పవన్ చిరంజీవి ఆడియో ఫంక్షన్ కు ఎందుకు రాలేదని టీవీ9 రవిప్రకాశ్ ప్రశ్నించగా మా మధ్య వైరం లేదని చిరు స్పష్టం చేశారు. తాను, పవన్ గడిచిన పండుగలో కలుసుకున్నామన్నారు. పవన్ రాజకీయాల్లో, షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లే రాలేకపోయాడన్నారు. అయినా ఫంక్షన్ రాకపోయినంత మాత్రనా మా మధ్య విభేధాలు అంటగట్టడం భావ్యం కాదని తేల్చిచెప్పారు..

ఇక రాంగోపాల్ వర్మ-నాగబాబు వైరంపై అడినప్పుడు చిరంజీవి స్పందించారు.. వర్మ గుణమే అలాంటిదని.. అలా విమర్శలు చేయడం వర్మ నైజమన్నారు. నాగబాబు నాపై ఉన్న ప్రేమ వల్ల అలా మాట్లాడారని.. సెన్సిటివ్ గా ఉండడం వల్ల స్పందించాడన్నారు. వర్మతో గతంలో తన సినిమా ఆగిపోయిందని.. సంజయ్ దత్ తో సినిమా కోసం నా సినిమా వర్మ వదిలేశాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. అసలు వర్మ గురించి తాను పట్టించుకోనని తెలిపారు..

To Top

Send this to a friend