fbpx

AP News Online

‘తుంగభద్ర’ ఫేమ్ అరుణ్ ఆదిత్ హీరోగా ‘ L7 ‘

poster7_apnewsonlinein

‘తుంగభద్ర’ ఫేమ్ అరుణ్ ఆదిత్ హీరోగా, పూజ ఝవేరి హీరోయిన్ గా మరియు ఇతరులు ప్రధాన పాత్రధారులుగా, రాహూల్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న చిత్రం ‘ఎల్7’. ఈ చిత్ర నిర్మాత గతంలో ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి పలు చిత్రాలు నిర్మించారు. నిర్మాత బి. ఓబుల్ సుబ్బారెడ్డిగారు మాట్లాడుతూ “లవ్, కామెడీ, థ్రిల్లర్ ప్రధానాంశాలుగా నిర్మించిన మా చిత్రం ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రేపే యూనిట్ సభ్యుల సమక్షంలో విడుదల చేస్తున్నాము. చిత్రం ఆడియోని అతి త్వరలో రిలీజ్ చేస్తున్నాము. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ‘ఇష్క్’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అరవింద్ శంకర్ పని చేశారు. ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ద్వారా ముకుంద్ పాండేని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాము. ఈయన గతంలో ఇష్క్, గుండె జారి గల్లంతయ్యింది, మనం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కధ,           స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాలలో పని చేశారు ” అని అన్నారు.

ఆర్టిస్ట్స్
అరుణ్ ఆదిత్ (హీరో)
పూజ ఝవేరి (హీరోయిన్)
వెన్నెల కిషోర్
అజయ్

టెక్నీషియన్స్
సినిమాటోగ్రఫీ  :  దుర్గా ప్రసాద్
ఆర్ట్  : నాగ సాయి
సంగీతం : అరవింద్ శంకర్
లిరిక్స్  : శ్రీమణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  :  ఎం. కిషోర్
కో-ప్రొడ్యూసర్స్ : మోహనరావు .బి, సతీష్ కొట్టె, కె. పున్నయ్య చౌదరి
సమర్పణ  : మాస్టర్ ప్రీతమ్ రెడ్డి
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ముకుంద్ పాండే
నిర్మాత  : బి. ఓబుల్ రెడ్డి

To Top

Send this to a friend