fbpx

AP News Online

నాగబాబు మాట్లాడింది వందశాతం సరైనదే — చిరంజీవి

nagababu-rgv-chiranjeevi-apnewsonline

నాగబాబు తనలా కాదని, అందుకే ఆగ్రహానికి గురయ్యాడని చిరంజీవి తెలిపారు. ఇటీవల ‘ఖైదీ నంబర్ 150’ ఫంక్షన్ లో యండమూరి, రాంగోపాల్ వర్మలపై నాగబాబు చేసిన కామెంట్లపై ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ, తమ కుటుంబంపై చేసే ట్వీట్స్, కామెంట్స్ ను చూస్తున్తామని, అలాంటప్పుడు కొంత ఆగ్రహానికి గురవుతామని ఆయన తెలిపారు. తన స్టేచర్ కి ఇవన్నీ సరిపోవు కనుక, తన నుంచి వాటిని బ్రష్ అవుట్ చేసేస్తానని ఆయన తెలిపారు. అయితే నాగబాబు తనలా తీసుకోలేకపోయాడని ఆయన అన్నారు. అయితే, నాగబాబు స్పందన సరైనదేనని ఆయన తెలిపారు. రాంగోపాల్ వర్మతో తమ కుటుంబానికి ఎలాంటి వివాదం లేదని ఆయన చెప్పారు. రాంగోపాల్ వర్మ నేచరే అంత అని ఆయన అన్నారు. ఆయన అనవసరంగా తమ కుటుంబంపై కామెంట్లు చేయడం మైలేజీ కోసమని ఆయన అన్నారు.
దీనికి కారణం ప్రత్యేకంగా ఏమీ లేదని ఆయన చెప్పారు. నాగబాబు తనలా ఈజీగా తీసుకోలేకపోయాడని ఆయన చెప్పారు. యండమూరి వీరేంద్రనాథ్ అంటే నాగబాబుకి చాలా ఇష్టమని ఆయన అన్నారు. నాగబాబు ఆయన కాళ్లకు నమస్కరిస్తాడని ఆయన తెలిపారు. అలాంటి వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడడం సరికాదని ఆయన తెలిపారు. ఆయన బహిరంగ సభల్లో తన భార్య సురేఖను సైతం ఏకవచనంతో సంబోధించడం ఎంత వరకు సంస్కారమో ఆయనే చెప్పాలని ఆయన అన్నారు. నాగబాబు చేసింది వంద శాతం సరైనదేనని ఆయన తెలిపారు. ఈ వివాదంలో నాగబాబు ఇకపై మాట్లాడతాడని తాను భావించడం లేదని, అయినా అవతలివారు మాట్లాడితే వారి స్థాయికే వదిలేస్తున్నామని ఆయన చెప్పారు.

Thanks to
Author:  T V Govinda Rao garu.

To Top

Send this to a friend