AP News Online

నోట్ల రద్దుతో కుదేలైన భారత్: వరల్డ్ బ్యాంక్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి మరింతగా తగ్గనుందని, భారత ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు తరువాత వృద్ధి రేటు మరింతగా కుదేలైందని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. తొలుత ఈ యేటి భారత వృద్ధి రేటు 7.6 శాతంగా ఉండవచ్చని ప్రకటించిన ప్రపంచ బ్యాంకు దాన్ని 7 శాతానికి సవరిస్తున్నామని, ఈ వృద్ధి కూడా చాలా దేశాలకన్నా మెరుగైనదేనని అభిప్రాయపడింది.
“వ్యవస్థలో ఉన్న కరెన్సీలోని అత్యధిక మొత్తాన్ని వెనక్కు తీసుకుని కొత్త నోట్లను జారీ చేయడం ద్వారా నవంబర్ నుంచి వృద్ధి మందగించింది. దీని ప్రభావం మూడో త్రైమాసికంలో స్పష్టంగా కనిపించగా, జనవరి – మార్చి మధ్య కాలంపైనా పడనుంది” అని వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. ఇండియాలో 80 శాతం లావాదేవీలు నగదుతోనే జరుగుతుండేవని గుర్తు చేస్తూ, నోట్ల రద్దుతో ఇండియాలో వ్యాపారం మందగించిందని, భారతీయుల ఆర్థిక వ్యవహారాలు తగ్గాయని నోట్ల రద్దు తరువాత భారత్ పై తన తొలి నివేదికలో వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.

పెద్ద‌నోట్ల ర‌ద్దు చ‌ర్య‌ మ‌న జీడీపీపై తీవ్రంగా ప్ర‌భావం చూపుతోందని ఆర్థిక వేత్త‌లు ఇప్ప‌టికే చెప్పార‌ని, దాన్ని బ‌ట్టే పెద్ద‌నోట్ల ర‌ద్దు ఎటువంటి ప్ర‌భావాన్ని చూప‌నుందో తెలుస్తోంద‌ని మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్చెప్పారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌రువాత దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఎన్నో ఇబ్బందులు ఏర్ప‌డ్డాయ‌ని తెలిపారు. దేశంపై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని అన్నారు. మోదీ అనుస‌రిస్తోన్న విధానాల వ‌ల్ల దేశ ఆర్థిక ప‌రిస్థితి ఛిన్నాభిన్న‌మ‌వుతుంద‌ని చెప్పారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌రింత గ‌డ్డుకాలం రానుందని తెలిపారు.

To Top

Send this to a friend