fbpx

AP News Online

పవ‘నిజం’ ఉంది.. అందుకే హార్వర్డ్ ఆహ్వానం

పవన్ కళ్యాణ్ అంటేనే విలక్షణం.. మనసున్న మానవతా వాది.. ఆయన ఏం చేసినా అది సంచలనమే.. పేదలను చూస్తే ఆయన గుండె తల్లడిల్లుతుంది. వారికి సాయం చేసేదాకా ఆయన నిద్రపోడు.. అందుకే తన సంపాదనలో ఎక్కువ భాగం సామాజిక సేవకే అంకితం చేసి ప్రతీసారి సినిమా చేస్తేనే తనకు ఆదాయం అంటూ చెబుతుంటారాయ..
ఉద్దానం బాధితులకు పరామర్శ కావచ్చు.. లేక అమరావతి రైతుల గోడు కావచ్చు.. ఏదైనా జనసేనాని అండగా బాధితులకు పరిష్కారం దొరుకుతోంది.. అన్నార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ఆయన పోరాడుతారు. అందుకే అంతటి దయాగుణం గల వ్యక్తికి తెలుగు హీరోల్లో ఏ హీరోకు లేని గౌరవం.. ఆదరణ.. ప్రాణాలిచ్చే అభిమానులున్నారు కాబట్టే ఆయన ఎప్పటికీ నిలిచి ఉంటారు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పండుగ చేసుకునే వార్తనే.. విశ్వవిఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రతిఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఇండియన్ కాన్ఫరెన్స్ 2017’ లో తన అభిప్రాయాలను పంచుకోవాలని హీరో పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. ఫిబ్రవరిలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరుకానున్నారని సమాచారం. బోస్టన్ లోని హ్వారర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఈ కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 11, 12 తేదిల్లో జరిగే ఈ ఈవెంట్ కు పవన్ కు ఇన్విటేషన్ వచ్చినట్టు సమాచారం. దీంతో ట్విట్టర్ లో పవన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ యూనివర్సిటీకి వెళ్తాడా లేదా అన్నది కొద్దిరోజుల్లో తేలనుంది..

To Top

Send this to a friend