fbpx

AP News Online

 పవన్ అభిమానులకు సంక్రాంతి కానుక

పవన్ అంటేనే మేనియా.. అదో ఊపు.. సంక్రాంతి పండుగ అంటేనే ఉత్సాహం.. పంటపొలాలు.. పచ్చని కొబ్బరి చెట్లు, ఎడ్ల బళ్లు, సంప్రదాయ దుస్తులు.. గొబ్బెమ్మలు,, ముగ్గులు.. ఇలా పండుగ నాడు మరింత ఉత్సాహం నింపేందుకు పవన్ సిద్ధమయ్యారు..  సంక్రాంతి సందర్భంగా అభిమానులకు మరింత జోష్ ను పంచాడు పవన్ కళ్యాణ్..

పవన్ నటిస్తున్న కాటమరాయుడు ఫస్ట్ లుక్ ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు.. సంక్రాంతి స్పురణకువచ్చేలా పంచెకట్టు, కోర మీసం..వెనకాల ఎడ్లబండి .. ముందు పవన్ కళ్యాణ్ రాజసం.. ఇలా సంక్రాంతి నాడు పవన్ తన కొత్త చిత్రం కాటమరాయుడు సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.. పవన్ కళ్యాణ్, శృతిహాసన్ జంటగా కిశోర్ పార్ధసారథి (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 26న టీజర్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు.. ఈ సందర్భంగా ‘‘ఈనెల 16న తాజా షెడ్యూల్ విడుదలవుతోంది.. ఉగాది కానుకగా మార్చి 29న చిత్రాన్ని విడుదల చేస్తాం..’ ఈ చిత్రానికి కెమెరా ప్రసాద్ మూరెళ్ల.. సంగీతం అనూప్ రూబెన్స్.. ఉగాది కానుకగా సినిమా విడుదల అవుతోంది..

To Top

Send this to a friend