fbpx

AP News Online

బీజేపీని వణికించి.. ఇప్పుడు దివాళా తీసిన సీఎం

arvind-kejriwal_delhicm

ఘోరం.. దారుణం.. రాజకీయ నాయకులు దివాళా తీయడమా.. అది ఖచ్చితంగా బ్రేకింగ్ న్యూసే.. దేశ ప్రధాని మోడీనే మట్టికరిపించిన యోధుడు ఇలా పైసా కూడా లేకుండా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం నిజంగా విధి వైచిత్యం.. మోడీ కొట్టిన నోట్ల రద్దు ఒక్క బీజేపీ వాళ్ళను తప్ప అందరినీ ఇబ్బంది పెట్టింది. ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు ఇబ్బడిముబ్బడిగా దాచిపెట్టుకున్న నల్లడబ్బు కాస్తా ఆవిరైపోయింది. ఇప్పుడు పారదర్శకంగా బ్యాంకుల్లో ఉన్నదే డబ్బు.. మోడీ నోట్ల రద్దుతో రాజకీయ పార్టీలకు నిధులు కరిగిపోయాయి.ఇప్పుడున్న క్లిష్ట డబ్బుల కొరత నేపథ్యంలో కొత్తగా పారిశ్రామిక వేత్తలు కానీ.. నాయకులు కానీ దమ్మిడి ఇచ్చే పరిస్థితి లేదు.. దీంతో అటు నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోయి.. వైట్ మనీ దొరకక రాజకీయ పార్టీలు మనుగడ సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి..

దేశంలో ఒంటిచేత్తో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోడీని ఢిల్లీలో చిత్తుచిత్తుగా ఓడించి కేవలం 3 సీట్లకే పరిమితం చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దేశంలో నవశకానికి నాంది పలికారు.. ఆయనో ఆశాకిరణంలా మారారు. అవినీతి రహిత భారత్ కోసం కృషిచేశారు. ఎన్నికల్లో డబ్బు పంచడాన్ని ఆయన నిషేధించారు. కానీ మోడీ విసిరిన పాచికకు కేజ్రీవాల్ తో పాటు అన్నిరాజకీయ పక్షాలు దెబ్బ అయపోయాయి. నోట్ల రద్దుతో పార్టీలకు ఫండ్స్ రావడం లేదు.. ఉన్నడబ్బులు అయిపోయాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా రెండేళ్లు అధికారంలో ఉన్నా కేజ్రీవాల్ దగ్గర దమ్మిడి లేదట.. పార్టీ ఖాతాలు బోసిపోయాయట.. అందుకే ఎన్నికల్లో పోటీకి నిధులు లేవని.. ఏకంగా యూపీ, గోవా, పంజాబ్ లలో పోటీచేయలేకపోతున్నామని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని ఇలా డబ్బుల్లేకుండా నడిరోడ్డు మీద నిలబెట్టిన మోడీని ఓడించాలని మాత్రం తాను అంతటా ప్రచారం చేస్తానని సెలవిచ్చారు.. ఇలా రాజకీయ నాయకుడిగా ఉండి డబ్బుల్లేక పోటీచేయని నిజాయితీ పరుడైన కేజ్రీవాల్ ను దేశం మొదటిసారి చూస్తోంది.. ఎన్నికవగానే కోట్లు వెనకేసుకునే నాయకుల కన్నా కేజ్రీవాల్ నూరు పాళ్లు మిన్న అనడం లో ఎలాంటి సందేహం లేదు..

To Top

Send this to a friend