fbpx

AP News Online

రాజమౌళి కీలక నిర్ణయం.. బాహుబలి నుంచి ప్రభాస్ ఔట్

prabhas_bahubali_apnewsonline

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్లు.. పెళ్లి పెటాకులు లేకుండా బాహుబలి రెండు సినిమాలకు అంకితమైన ప్రభాస్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. బాహుబలి రెండో భాగం చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది.. ప్రభాస్ నటించాల్సిన సన్నివేశాలు మొత్తం పూర్తయ్యాయట.. దీంతో ప్రభాస్ ను షూటింగ్ నుంచి చిత్రం యూనిట్,రాజమౌళి ఇంటికి పంపించారు. ఈ మేరకు బాహుబలి చిత్ర యూనిట్ తమ అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో ఈ మేరకు ప్రకటించింది. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ దాదాపు పూర్తయ్యింది..యానిమేషన్ వర్క్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఏప్రిల్ వరకు దాన్ని పూర్తి చేసి విడుదల చేయాలని రాజమౌళి కసరత్తు చేస్తున్నారు.. అందులో భాగంగానే చిత్రీకరణ పూర్తి కావడంతో ప్రభాస్ వీడ్కోలు పలికారు..
కాగా బాహుబలి కోసం పనిచేసిన రానా, అనుష్క, తమన్నా, కట్టప్ప సత్యరాజ్ లు ఈ సినిమా షూటింగ్ సమయంలో జాప్యంతో వేరే సినిమాల్లో నటించారు. కానీ బాహుబలి ప్రభాస్ ఆ లుక్ , శరీర సౌష్టవం పాడవకుండా బాహుబలి సినిమాకోసేం నాలుగేళ్లు అంకితమయ్యారు. దీంతో ఆయనకు పేరుతో పాటు డబ్బు, ప్రఖ్యాతలు వచ్చాయి. దేశం గర్వించదగ్గ సినిమా కోసం నాలుగేళ్లు కష్టపడడం తప్పులేదని అప్పట్లో ప్రభాస్ కూడా అన్నారు. ఎట్టకేలకు బాహుబలి చిత్రీకరణ ముగిసిపోవడంతో ఇక ప్రభాస్ ఆ మీసాలు.. కండలు లుక్ తీసేసి మామూలు గెటప్ లోకి మారుపోనున్నారు. ప్రభాస్ తర్వాతి చిత్రం రన్ రాజా రన్ డైరెక్టర్ సుదీప్ తో చేస్తున్నారు. ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీయనున్న ఈ సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పారు. తర్వాత షూటింగ్ అందులోనే పాల్గొననున్నారు.ఈ మధ్యలో డార్లింగ్ ప్రభాస్ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు సమాచారం.

To Top

Send this to a friend