fbpx

AP News Online

లైంగిక దాడులను కళ్లప్పగించి చూస్తారా? – కోహ్లీ

virat-kohli-apnewsonline

నూతన సంవత్సర వేడుకల్లో ఐటీ సిటీ బెంగళూరులో మృగాళ్లు రెచ్చిపోయారు. ఒంటిరిగా కనిపించిన ఆడవాళ్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. కురుచ దుస్తులు ధరించిన మహిళలపై ఎగబడి తాకరాని చోటల్లా తాకి.. ముద్దులు పెట్టి రేప్ కు యత్నించారు. ఆ దారుణాలు సీసీ టీవీ పుటేజీల్లో బయటపడడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ప్రతి ఒక్కరు ఈ దాడులను ఖండించారు.

కాగా దీనిపై లేట్ గానైనా.. లేటెస్ట్ గా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. మదమెక్కిన మృగాళ్లు మహిళలపై దాడులకు పాల్పడుతుంటే పిరికిపందల్లా చూసిన వాళ్లకు.. మగాళ్లని చెప్పుకునే అర్హత లేదంటూ పరుష పదజాలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గు పడుతున్నానన్నారు. బెంగళూరు ఘటనలు తనను కలిచివేశాయని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. మీ కుటుంబంలోని వారిపై ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే చూస్తూ ఊరుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. అడ్డుకునే వారే లేరని అరాచక శక్తులు పేట్రేగిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంత జరిగినా మహిళలనే తిడుతున్నారని.. ఎవ్వరూ ఖండించకపోవడాన్ని కోహ్లీ తప్పుపట్టారు.

బెంగళరులో జరిగిన దారుణాలు వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend