AP News Online

వారు కథలో ఒదిగిపోతారు.. మనం వాళ్లపైనే కథ రాస్తాము..

aamir-khan-Dangal

సినిమాలు హిట్ కావడమే గగనమైన పరిస్థితులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఎంత కసరత్తు చేసినా.. సినిమా స్టోరీలు నాణ్యంగా రాని పరిస్థితి నెలకొంది. అలాంటిది ఈ అమీర్ ఖాన్ లో ఏముంది.. పట్టిందల్లా బంగారమవుతోంది.. కథ కోసం ఒళ్లు హూనం చేసుకుంటున్నాడు. పాత్ర కోసం ప్రాణాల మీదకుతెచ్చుకుంటున్నాడు. స్టార్ హీరో అయ్యిండి.. ముసలోడి పాత్రలో.. యువకుడి పాత్రలో నటించే దమ్ము ఈయనకు మాత్రమే ఎందుకు ఉంది.. విలక్షణ చిత్రాలతో వరుస హిట్ లు కొడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న అమీర్ ఖాన్ నిజంగా అందరు హీరోలకు స్ఫూర్తి దాయకం..
మన తెలుగు హీరోలు ఒక్క డెబ్బ కొడితే 20 మంది గాల్లో లేచిపోవాలి.. బాలయ్య తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లాలి.. మహేశ్ లాంటి హీరోలు చొక్కా విప్పడానికే సందేహిస్తారు.. అలాంటిది అమీర్ లా పాత్ర కోసం ముసలోడి పాత్రను వేస్తారా.. పవన్ విలన్ల చేతిలో దెబ్బలు తినే పాత్రలు పోషిస్తాడా.. వారికి మనకు అదే తేడా.. వారు కథలో ఒదిగిపోతారు.. మన వాళ్లపై నే కథ రాస్తారు.. అందుకే ఇక్కడ కథలు ప్లాప్ అవుతున్నాయి కనీసం పెట్టుబడి రాకుండా నిర్మాతల్ని ముంచేస్తున్నాయి. అక్కడ మాత్రం కథను బట్టి సినిమా చేస్తారు అందుకే హిట్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దంగల్’ రూ.300 కోట్ల క్లబ్ లో చేరాడు. తెలుగు, బాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కానీ ఫీట్ సాధించాడు. వరుసగా పీకే, దంగల్ చిత్రాలతో 300 కోట్లు కొల్లగొట్టిన హీరోగా చరిత్రకెక్కాడు..

To Top

Send this to a friend