fbpx

AP News Online

సందీప్‌కిషన్‌, రెజీనాల ‘నగరం’ 

SANDEEPREGINA
యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌, అందాల నటి రెజీనా జంటగా ఎ.కె.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై లోకేష్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో అశ్వనికుమార్‌ సహదేవ్‌ తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘నగరం’ అని పేరు పెట్టారు. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని వచ్చేవారం రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. సందీప్‌ కిషన్‌ కెరీర్‌లో మరో మంచి హిట్‌ చిత్రంగా ‘నగరం’ రూపొందుతోందని నిర్మాత అశ్వనీకుమార్‌ సహదేవ్‌ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జావేద్‌, ఫొటోగ్రఫీ: సెల్వకుమార్‌, నిర్మాత: అశ్వనికుమార్‌ సహదేవ్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లొకేష్‌.
To Top

Send this to a friend