fbpx

AP News Online

Khaidi no 150 – నాగబాబు X వర్మ, యండమూరి

nagababu-khaidino150

చిరంజీవి 150 వ సినిమా వేదిక సాక్షిగా విభేధాలు భగ్గుమన్నాయి. అన్నయ్య అంటే అభిమానం కట్టలు తెగే తమ్ముడు నాగబాబు చిరంజీవి 150 వ సినిమాపై అవాకులు, చెవాకులు పేలిన ఇద్దరినీ వేదికపై కడిగిపారేశాడు.. పరుష పదజాలతో వారిపై విరుచుకుపడ్డారు..

చిరంజీవి 150 వ సినిమాపై కామెంట్లు చేసిన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ను పట్టుకొని నాగబాబుర్ సన్నాసి అని సంభోదించాడు.. ‘జనాలకు మానసిక బలంపై సూత్రాలు వల్లించడం మాని అతడే మెంటల్ ఎబిలిటీ పెంచుకోవాలని ’ ఫైర్ అయ్యారు. రాయడం చేతకాని ఎదవలు కష్టపడి పైకొచ్చిన చిరంజీవి ని చూసి మొరగడమా అని విరుచుకుపడ్డారు.

ఆ తర్వాత ట్విట్టర్ లో చిరు సినిమాపై కామెంట్లు పెట్టిన వర్మను సైతం నాగబాబు ఊరుకోలేదు.. ‘సోషల్ మీడియాలో కారు కూతలు కూసే ఒకడు.. అడ్డదారిలో దర్శకుడై ముంబై వెళ్లి వరుస ప్లాపులు తీశాడని.. ముందు వాడిని సినిమాలు తీయడం నేర్చుకో అక్కు పక్షి’ అంటూ వర్మను ఉద్దేశించి సభావేదిక సాక్షిగా నిప్పులు చెరిగారు..

కాగా ఈ విమర్శలపై రాంగోపాల్ వర్మ యుద్ధమే ప్రకటించారు. నాగబాబు విమర్శలకు స్పందిస్తూ‘ మీ అన్నయ్య చిరంజీవి మీద ఆధారపడి బతుకుతున్నావ్..’ అంటూ నాగబాబును విమర్శించారు. ఆ తర్వాత చిరంజీవి మీద అభిమానం ఉందని నేను ఆ వ్యాఖ్యలు చేయలేదని సెలవిచ్చాడు..

మొత్తంగా చిరు ఆడియో వేడుక సాక్షిగా తెలుగు చిత్రపరిశ్రమలో వివాదాలు ముసురుకున్నాయి. గతంలోనూ దాసరి-చిరు వివాదం ముదిరినా తర్వాత ముగిసిపోయింది. నిన్న చిరు ఫంక్షన్ కు దాసరియే ముఖ్య అతిథిగా రావడం గమనార్హం. తర్వాత మోహన్ బాబు-చిరులు కూడా వివాదం లో చిక్కుకొని బయటపడ్డారు.

ఎవ్వరు ఏ విమర్శలు చేసినా చిరంజీవి మళ్లీ రీయింట్రీ ఇస్తున్నాడు. కథ దొరకకో నచ్చకో.. తమిళ కథను ఎంచుకున్నాడు. దీన్ని అవకాశం రాంగోపాల్ వర్మ చిరుకు కథే దొరకడం లేదని విమర్శించడం సరికాదు. యండమూరి కూడా తన స్థాయికి మించి చిరు కుటుంబం సభ్యులపై అటాక్ చేయడం దారుణం.. ఎంతో కష్టపడి పైకెదిగిన చిరును ఆడిపోసుకున్నందుకు తమ్ముడు నాగబాబు రియాక్ట్ అయ్యి విమర్శలు గుప్పించడంతో తెలుగు ఇండస్ట్రీలో ఈ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..

నాగబాబు విమర్శలను కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend