AP News Online

జూలైలో అల్లరి నరేష్ ‘సెల్ఫీ రాజా’

అల్ల‌రి న‌రేష్ హీరోగా సుంక‌ర రామ‌బ్ర‌హ్మం స‌మ‌ర్ప‌ణ‌లో  ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్, గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం ఫేమ్ జి.ఈశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ ‘సెల్ఫీరాజా’. చ‌ల‌సాని రామ‌బ్ర‌హ్మం చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సెల్ఫీ మానియక్ గా అల్లరి నరేష్ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. సాక్షిచౌదరి, కామ్నా రనవత్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలను త్వరలో విడుదల చేసి సినిమాను జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

To Top

Send this to a friend