AP News Online

జూలై 2న ‘నిర్మల కాన్వెంట్‌’ డిజిటల్‌ ట్రైలర్‌

roshan001
కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘నిర్మల కాన్వెంట్‌’. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ టోటల్‌గా పూర్తయింది. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున చేసిన స్పెషల్‌ క్యారెక్టర్‌ సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతుంది. జైపూర్‌, అరకు, నైనిటాల్‌, చిక్‌మంగుళూరు వంటి డిఫరెంట్‌ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని ఎంతో లావిష్‌గా చిత్రీకరించారు.
జూలై 2న మూవీ డిజిటల్‌ ట్రైలర్ని రిలీజ్‌ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ చిత్రం డిజిటల్‌ ట్రైలర్‌ను జూలై 2న విడుదల చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంతో సంక్రాంతి సూపర్‌హిట్‌ కొట్టిన కింగ్‌ నాగార్జున ‘నిర్మల కాన్వెంట్‌’ చిత్రంలో చేసిన స్పెషల్‌ క్యారెక్టర్‌తో మరోసారి అందర్నీ ఆకట్టుకోబోతున్నారు.
కింగ్‌ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.
To Top

Send this to a friend