AP News Online

ర‌ష్మి గౌత‌మ్‌ ‘అంతం’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై 7న విడుద‌ల‌

Date 4 Sheet Poster 2
గుంటూరు టాకీస్ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంతో యువ‌తని కేరింత‌లు కొట్టించిన ర‌ష్మిగౌతమ్ ప్ర‌దాన‌పాత్ర‌లో న‌టించిన చిత్రం అంతం జులై 7 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లవుతుంది. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ చాలా పెర్‌ఫెక్ట్ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించిన  ఈ చిత్రం ట్రేడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం, మెత్తం రెండు రాష్ట్రాల‌కి ఫ్యాన్సి రేట్ కి బిజినెస్ చేయ‌టం విశేషం. రష్మీ అందచందాలతో పాటు పెర్ పార్మెన్స్ కు స్కోప్ ఉన్న అద్బుత‌మైన పాత్ర‌లో నటించింది. ఎప్ప‌టిక‌ప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ త‌న కెరీర్ ని అందంగా మ‌లుచుకునే రష్మీ  గౌతమ్ కి ఈ చిత్రం చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇటీవ‌లే సెన్సారు కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈచిత్రానికి A స‌ర్టిఫికేట్ ని అందించారు.
ఈ సందర్బంగా దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాట్లాడుతూ…. మా అంతం చిత్రం ఇప్పటివరకు రాని అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అని గర్వంగా చెప్పగలను. అదే మాట సెన్సారు వారు చెప్ప‌టం మాకు A స‌ర్టిఫికేట్ ఇవ్వ‌టం చాలా ఆనందంగా వుంది.  గుంటూరు టాకీస్ చిత్రంలో చాలా మంచి ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన  రష్మీ గౌతమ్ మా చిత్రంలో  గ్లామర్ తో పాటు టెర్రిఫిక్ పెర్ పార్మెన్స్ ఇచ్చింది. ఈ చిత్రం చూసిన త‌రువాత హీరోయిన్ ర‌ష్మి అంద‌మైన ఫెర్‌ఫార్మెన్స్ గురించి త‌ప్ప‌కుండా మాట్లాడుతారు. గుంటూరు టాకీస్ చిత్రం త‌రువాత ర‌ష్మి న‌టించిన చిత్రం కావ‌టం తో సిని ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన క్రేజ్ వుంది. థ్రిల్ నే కాకుండా అన్ని ర‌కాట ర‌సాలు ఈ చిత్రంలో పొందుప‌రిచాము. త‌ప్ప‌కుండా ప్ర‌తి ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకుంటుంది. మాలాంటి చిన్న చిత్రాన్ని ఇండ‌స్ట్రి పెద్ద‌లు ఆశీర్వ‌దించినందుకు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము. మేము విడుద‌ల చేసిని ట్రైల‌ర్ కి హ్యుజ్ రెస్పాన్స్ రావ‌టం విశేషం.  సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని A సర్టిఫికెట్ పొందిన మా అంతం చిత్రాన్ని జులై 7 న విడుద‌ల చేయ‌నున్నాము. అని అన్నారు.
నటీనటులు
రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్
సాంకేతిక వర్గం
ప్రొడక్షన్ బ్యానర్ – చరణ్ క్రియేషన్స్
సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, డిఐ – జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
మ్యూజిక్ – కార్తిక్ రోడ్రిగ్జ్
స్టంట్స్ – రామ్ సుంకర
పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను
సౌండ్ ఎఫెక్ట్స్ – ఎతిరాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత – జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
To Top

Send this to a friend